AP: మంత్రి లోకేష్‌పై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం లోకేష్ ఇచ్చిన మాట తప్పారని AISF ఛలో విజయవాడకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.