ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం మురుగుమ్మి పంచాయతీకి చెందిన 11 కుటుంబాలు శుక్రవారం కనిగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.