PPM: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రి గుమ్మడి సంధ్యా రాణి పీఏ బండాపు సతీష్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఇటీవల తనపై వస్తున్న ఆరోపణలు బాధాకరమని, కావాలనే తన పై కుట్రలు పన్నారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఏ రోజూ తమ పేరు చెప్పుకొని లబ్ది పొందేందుకు ప్రయత్నించలేదన్నారు.