TPT: ప్రజా సమస్యల పరిష్కారం కోసం వరదయ్య పాలెంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ శుక్రవారం జరిగింది. టీడీపీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ప్రజలు ఇచ్చిన అర్జీలను తీసుకుని సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకొన్నారు. సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్లో సుమారు 200 వరకు అర్జీలు అందాయి.