TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామాల్లో పూర్తి వ్యతిరేకత ఉందని.. ఇక, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశమే లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుందన్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని విమర్శించారు.