GNTR: మంగళగిరి మండలం రామచంద్రపురంలో ‘రైతన్న మీకోసం’లో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ ప్రారంభించారు. దళారులను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలని, తేమ 17% మించకూడదని సూచించారు. 75 కేజీల ‘ఏ’ గ్రేడ్ ధర రూ.1792, కామన్ రకం రూ.1777 అని రైతు నేత రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.