AP: విశాఖ-విజయవాడ-లింగంపల్లి మధ్య వెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ రూట్లో రైల్వే ట్రాక్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, దీనివల్ల 16 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 27 నుంచి 31 తేదీల మధ్య ఈ రూటులో 16 రైళ్ల రాకపోకలు సాగవని వెల్లడించింది. ప్రయాణికులు దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించింది.