GNTR: రాజస్థాన్లోని బికనీర్లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడా పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) విద్యార్థి ఎం. అశోక్ కుమార్ శుక్రవారం మూడో స్థానం సాధించారు. వెయిట్ లిఫ్టింగ్ 94 కేజీల కేటగిరీలో ఆయన కాంస్యం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ను వర్సిటీ వీసీ గంగాధరరావు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.