MDK: తూప్రాన్ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి పరిశీలకులు శ్రీనివాసులు సందర్శించారు. పాఠశాలలో తరగతి గదులను, ఉపాధ్యాయుల బోధన తీరును, విద్యార్థుల పఠన సామర్థ్యం, కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, విద్యార్థుల జవాబు పత్రాలను పరిశీలన చేశారు. ఎంఈవో డాక్టర్ సత్యనారాయణతో కలిసి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.