ATP: కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హల్లో శుక్రవారం అరటి వ్యాపారస్తులు, ఎగుమతిదారులు, ఉద్యాన శాఖ అధికారులతో అరటి ధర నియంత్రణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యాపారులు అరటి కిలోకు రూ. 6 తగ్గకుండా రైతుల నుంచి కొనుగోలు చేయాలని, ఎగుమతి దారులు ఇతర దేశాలకు మార్కెట్కు రూ.8 తగ్గకుండా కొనుగోలు చేయాలని సూచించారు.