WGL: రాయపర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన గారే సయేంద్ర బిక్షపతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వారి అనుచరులతో కలసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వారిని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.