సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం పుట్టపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏఆర్ సాయుధ బలగాలు, హోమ్‌గార్డుల పరేడ్‌ను పరిశీలించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, సిబ్బంది ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం, ధ్యానం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే విధులు సమర్థవంతంగా నిర్వహించగలమని ఎస్పీ అన్నారు.