ప్రకాశం: గిద్దలూరు మండలం ముండ్లపాడు పంచాయతీలోని బురుజుపల్లె గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం వైసీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలు వైద్యానికి దూరమవుతారని, ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు నడవాలని డిమాండ్ చేశారు.