SKLM: మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం అని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస మున్సిపాలిటీలో 15 ,16 వార్డులకు సంబంధించిన డ్వాక్రా మహిళలకు మున్సిపల్ కమిషనర్ ఐ శ్రీనివాస్ అధ్యక్షతన మెప్మా మహాజన సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు.