TPT: శ్రీ కాళహస్తి మండల వైసీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి చెవిరెడ్డి జయమ్మ అంత్య క్రియలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి పాల్గొని ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి పాడే మోశారు. వారి కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.