PDPL: అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని మంథని సింగిల్ విండో ఛైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మంథనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు.