సౌతాఫ్రికాపై వన్డేల్లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డును కలిగి ఉన్నాడు. ఆ జట్టుపై 29 ఇన్నింగ్స్‌ల్లో 65.39 సగటుతో 1,504 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, ఈనెల 30న తొలి వన్డే జరగబోయే JSCA స్టేడియంలోనూ 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలతో 384 రన్స్ బాదాడు. ఈ స్టేడియంలో కోహ్లీ ఆడిన చివరి మ్యాచ్‌లో కూడా 123 పరుగుల సెంచరీతో అదరగొట్టాడు.