గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే “పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే” కార్యక్రమంలో ఇవాళ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ విభాగాల పోలీసులు తమ వ్యక్తిగత, సర్వీసు, బదిలీలకు సంబంధించిన సమస్యలను సమర్పించారు. వాటి సమయానుకూల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.