HYD: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘GOAT TOUR TO INDIA 2025’లో భాగంగా DEC 13న HYDకి రానున్నారు. ఈ సందర్భంగా, మెస్సీకి స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. మెస్సీ వంటి లెజెండ్‌ను మన గడ్డపై చూడటం ప్రతి ఫుట్‌బాల్ అభిమాని కల అని ఆయన ‘X’లో ట్వీట్ చేశారు.