JN: బంగారం ఇస్తానని ప్రజలను మోసం చేసిన భార్యాభర్తలు అరెస్ట్ అయిన ఘటన పాలకుర్తిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన సింగపురం గౌరమ్మ, ఆమె భర్త సింగపురం వెంకటయ్యలు బంగారం దొరికిందని డబ్బులు ఇస్తే అందులో కొంత వాట ఇస్తాను అని నమ్మబలికి మోసం చేశారు. దర్యాప్తు చేసి నేడు వారిని పోలీసులు రిమాండ్కు చేశారు.