MHBD: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగూడ గ్రామ పంచాయతీకి బీజేపీ అభ్యర్థిగా గాంధీనగర్ గ్రామానికి చెందిన గుగులోత్ వినోద్ స్వామి నాయక్‌ను ఎంపిక చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి మురళి ఈ విషయాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆదేశాల మేరకు స్థానిక నాయకుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు BJP నేతలు పేర్కొన్నారు.