JGL: మేడిపెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోలు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఎమ్మార్వో, ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.