GNTR: దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు ధరలు నిలకడగా ఉన్నాయి. క్వింటాల్ పసుపు గరిష్ఠంగా రూ. 12,700 ధర పలికింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపు కొమ్ముల ధర రూ. 9 వేల నుంచి రూ. 12,700 వరకు, కాయ రకం పసుపు ధర రూ. 9,300 నుంచి రూ. 12,190 వరకు పలికాయి. మార్కెట్లో మొత్తం మీద పసుపు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.