WPL-2026 మెగా వేలంలో తెలుగమ్మాయి శ్రీచరణి కోసం ఢిల్లీ, యూపీ పోటీపడ్డాయి. చివరకు రూ.1.30 కోట్లతో ఢిల్లీ దక్కించుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ను యూపీ వారియర్స్ రూ.1.20 కోట్లకు జట్టులోకి తీసుకుంది. భారతి ఫుల్మాలిని RTM కార్డు ఉపయోగించి రూ.70 లక్షలకు గుజరాత్ జట్టులోకి తీసుకున్నారు.