SKLM: పొందూరు మండలం బాణం గ్రామానికి చెందిన జీరు వెంకటరెడ్డికి తన భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు విధిస్తూ జిల్లా అదనపు న్యాయస్థానం జడ్జి పీ. భాస్కరరావు తీర్పునిచ్చారు. ఈ మేరకు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. 2018 మార్చి 14న ఈ సంఘటన జరగడంతో మృతురాలు తల్లి కర్ణపు నీలమ్మ ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదయింది. తాజాగా తీర్పు వచ్చింది.