WPL-2026 మెగా వేలంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రపంచకప్ క్వీన్ దీప్తి శర్మ కోసం హైడ్రామా నడిచింది. ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ పోటీ పడగా.. ‘RTM’ కార్డ్ ఉపయోగించి యూపీ రూ.3.20 కోట్లతో ఆమెను జట్టులోకి తీసుకుంది. ఈ ధరతో WPLలో ఇప్పటివరకు రెండో అత్యధిక ధర కలిగిన ప్లేయర్గా దీప్తి శర్మ నిలిచింది. గతంలో స్మృతి మంధానను RCB రూ.3.4 కోట్లకు దక్కించుకుంది.