KRNL: సీఎం చంద్రబాబు నిర్ణయాలతో ప్రభుత్వ వైద్యం నిర్వీర్యమవుతోందని కోడుమూరు వైసీపీ ఇంఛార్జి ఆదిమూలపు సతీష్ విమర్శించారు. గురువారం గూడూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నిధుల లేమిని సాకు చూపుతూ.. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.