కృష్ణా వరదల కారణంగా కొట్టుకుపోయిన ఏడ్లంక కాజ్వే నిర్మాణానికి అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులు బొబ్బా గోవర్ధన్ నిధులు సమకూర్చారు. గురువారం కాజ్వే పునరుద్ధరణ పనులు టీడీపీ నేతలు ప్రారంభించారు. కాజ్వే కొట్టుకు పోవడంతో పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు, పనులకు వెళ్ళే మహిళలు నదిలో దిగి వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.