SDPT: 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.గురువారం సిద్దిపేట కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్ప రాష్ట్ర ప్రజల మీద శ్రద్ధ లేదన్నారు. ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి మాయమాటలతో రేవంత్ రెడ్డి గద్దె ఎక్కారని విమర్శించారు.