W.G: బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, ముఖ్యంగా బాలికలకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలని ఐసీడీఎస్ సీడీపీవో టీ.ఎల్. సరస్వతి అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం వెలుగు కార్యాలయంలో ANH సభ్యులకు బాల్య వివాహాలపై ఆమె అవగాహన కల్పించారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల శారీరక సమస్యలు వస్తాయని వివరించారు.