TPT: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. గతంలో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తికి తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినవారి సంఖ్య 9కి చేరింది.