ELR: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీసులో పీ- 4 అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు సబ్ కలెక్టర్‌తో కలిసి మంత్రి చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. నూజివీడు నియోజకవర్గ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.