W.G: అత్తిలి మండలం పాలూరులో శుక్రవారం ‘రైతన్న.. మీకోసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పి. సామ్యూల్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఉదయం 8.30 గంటలకు గ్రామానికి వస్తారని ఆయన గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా సాగు అంశాలు, ధాన్యం సేకరణపై రైతులతో వారు మాట్లాడతారని వివరించారు.