MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం ఫార్మసీ ఆడిటోరియంలో గురువారం ఫార్మసీ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో యాంటీ బయోటిక్స్ అధిక వాడకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.