KRNL: జిల్లాలో వలసలు అరికట్టి గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పనులు వెంటనే కల్పించాలని డిసెంబర్ 1న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం వర్షాభావంతో వ్యవసాయ పనులు లేక వేలాది మంది వలసలకు బయలుదేరుతున్నా, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.