తమిళనాడుకు దిత్వా తుఫాన్ ముప్పు ఉన్న నేపథ్యంలో అధికారులతో సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. అయితే తమిళనాడులోని నాలుగు జిల్లాలకు రెడ్, ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణశాఖ జారీ చేసింది. చెన్నై పోర్ట్‌లో రెండో ప్రమాద, నాగపట్నం పోర్ట్‌లో నాలుగో ప్రమాద హెచ్చరికలు విధించింది.