ADB: జిల్లాలో ఎంపికైన దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు ఆశన్న, జిల్లా కార్యదర్శి అరిఫా బేగం అన్నారు. ఈ విషయమే గురువారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ వారికి ఇప్పటివరకు పరికరాలు అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.