VZM: విజయనగరం 1వ పట్టణ పోలీస్స్టేషన్లో 2024లో నమోదైన గంజాయి కేసులో ఐదుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మీనాదేవి గురువారం తీర్పు వెలువరించారని SP దామోదర్ తెలిపారు. జూలై 26, 2024న పాత రైల్వే క్వార్టర్స్ వద్ద 8 కిలోల గంజాయి స్వాధీనం చేసిన కేసులో సాక్ష్యాలను సమర్పించారన్నారు.