NDL: గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లపై రూ.20 వేల కోట్ల అదనపు భారం పడిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. 15 వేల కి.మీ. మేర రోడ్లు.. మరమ్మతులకు పనికిరాకుండా పోయాయని అన్నారు. 30 వేల కి.మీ. రోడ్లను గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లకు రూ.3వేల కోట్లతో మరమ్మతులు చేసినట్లు చెప్పారు.