BDK: పార్టీకి, పేదవర్గాల పోటు ప్రసాద్ అందించిన సేవలు శాశ్వతంగా గుర్తుండిపోతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా అన్నారు. అశ్వారావుపేట పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పోటు ప్రసాద్ ప్రథమ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.