W.G: ఉండి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కాళ్ళ మండలం కోపల్లె 4 లేన్ల నూతన వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 కోట్లు మంజూరు చేసింది.