NZB: మెండోరా మండలం వెల్గటూర్ పెద్దవాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. అల్లెపు లింబాద్రి, పెనుగొండ శ్రీనివాస్, వేముల రామరాజు, ఓర్సు శ్రీనివాస్‌లపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.