PPM: మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని జేసీ యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం గరుగుబిల్లి మండలంలోని పెద్దురు గ్రామంలో ఉన్న శ్రీ భారతి ఆగ్రో మిల్లును, రావుపల్లిలో రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు మిల్లులో జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మిల్లుకు ధాన్యం తరలింపు, నిల్వ ఉంచిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు.