SDPT: అయ్యప్ప మాల ధరించిన పోలీసు అధికారి పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవడం సరైనది కాదని గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గురువారం అన్నారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా, మనోభావాలను దెబ్బ తీసే విధంగా పోలీస్ రూల్స్ ఉన్నాయన్నారు. డ్యూటీలో దీక్షలు చేయడానికి అనుమతి లేదని SI కి మెమో జారీ చేయడం సరైంది కాదన్నారు.