NZB: ఆర్మూర్ మున్సిపల్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. మున్సిపల్ కమిషనర్ రాజు ఇంట్లో సోదాలు చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. కమిషనర్ రాజు ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. ఓ బిల్డింగ్ పర్మిషన్ విషయంలో దరఖాస్తుదారుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.