SKLM: ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సూచించారు. మందస పోలీస్ స్టేషన్ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు రికార్డులు,కేస్ ఫైల్స్, క్రైమ్ రేట్ వివరాలను పరిశీలించారు. అలాగే పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో నేరాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు.