NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపును పార్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన చేశారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుజాత పాల్గొన్నారు.