AP: కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, వారికి సహకరించిన వ్యాపారులను మాత్రమే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన సిట్.. తాజాగా టీటీడీ కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసింది.