TPT: శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో రూ. 50 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గురువారం పరిశీలించారు. స్టేషన్లో మొదటి దశలో జరుగుతున్న పనుల పురోగతిని ఆయన తనిఖీ చేశారు. పాత ఎల్సీ గేట్ నెం. 28 వద్ద అండర్ పాస్ మూసివేయడంతో అక్కడ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.