CTR: రాష్ట్ర వన్నెకుల క్షత్రియ డైరెక్టర్, టీడీపీ యువ నాయకుడు భూపతి విద్యుత్ షాక్తో మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. గురువారం భూపతి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మృతి పార్టీకి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.